- ఆ విషయంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి
Vijayasai Reddy: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని.. కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. కామర్స్ స్థాయి సంఘం నివేదికలను సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుపతిలో విషవాయువు పీల్చి కార్మికుడు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
తిరుపతి వైకుంఠపురంలో విషాదం నెలకొంది. మ్యాన్‌హోల్‌లో దిగిన విషవాయువు పీల్చి కార్మికుడు మృతి చెందాడు మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. మ్యాన్‌హోల్ శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు నడుముకు తాడు కట్టుకుని లోపలికి దిగారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Lock to Bank: పంట రుణాల్లో అవకతవకలు.. బ్యాంకుకు తాళం వేసిన రైతులు
Lock to Bank: పంట రుణాల్లో అవకతవకలు జరిగాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగిన రైతులు... సిబ్బందిని లోపలే ఉంచి తాళం వేశారు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పంట బీమా చెల్లించలేదని రైతులు ఆగ్రహం...గ్రామ సచివాలయానికి తాళం
Farmers Agitation: చినుకు పడిన నాటి నుంచి చిగురు తొడిగి.. పంట చేతికొచ్చేంత వరకూ.. ఒపిగ్గా ఎదురు చూసే రైతన్నలు కోపోద్రిక్తులయ్యారు. పంట బీమా తమకు ఇంకా అందలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం మాచనూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతి ఎన్నికపై ఖర్గే- రాజ్‌నాథ్ కీలక చర్చలు.. ఏకగ్రీవం దిశగా...!
President election news: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి.. అధికార పక్షం మద్దతు పలకనుందా? ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా భాజపా అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా?... కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు, విపక్షాలను ఏకం చేసేందుకు మమత ఏర్పాటు చేసిన భేటీకి తెరాస, ఆప్ దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాపం పిల్లాడు.. నమ్మి అప్పగిస్తే ఇంత దారుణమా..?
ఆ పిల్లాడి తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే. అందుకే ఆలనాపాలనా చూసుకోవడానికి ఓ మహిళను నియమించారు. కానీ గత కొద్దిరోజులుగా ఆ చిన్నారి నిశ్శబ్దంగా ఉండడం చూసి అనుమానపడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన చెప్పింది విని షాకయ్యారు. వెంటనే సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి ఉలిక్కిపడ్డారు. తమ కుమారుడ్ని చిత్రహింసలకు గురిచేసిన ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అక్కడ మహిళలకు 3 రోజులు నో వర్క్- ఓన్లీ ఫన్!
ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా 3 రోజుల పాటు 'రజా పర్బా' నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజులు మహిళలను దేవతల్లా ఆరాధిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకృతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బుధవారం ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 5G స్పెక్ట్రం వేలానికి కేబినెట్ ఓకే.. అందుబాటులోకి వస్తే 10 రెట్ల వేగంతో..
5G Spectrum Auction: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా కేంద్రం మరో ముందడుగు వేసింది. 5G స్పెక్ట్రమ్ వేలంను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇప్పుడు 4జీలో వస్తున్న డౌన్‌లోడ్ స్పీడ్ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందే వీలుంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రికెట్ కేవలం డబ్బు మాత్రమే కాదు.. అది కూడా..: దాదా
IPL Media rights Ganguly: ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల రికార్డు ధరకు అమ్ముడుపోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. క్రికెట్ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదని, ఇది ప్రతిభకు సంబంధించినదని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అలా చేయలేదని దర్శకుడు హరీశ్ శంకర్ బాగా తిట్టేశారు'
Akashpuri Alitho Saradaga: ఓ సినిమా షూటింగ్లో దర్శకుడు హరీశ్ శంకర్ తనను బాగా తిట్టినట్లు గుర్తుచేసుకున్నాడు యువ హీరో ఆకాశ్‌పూరి. చిన్నతనంలో ఓ సారి దొంగతనం చేసి దొరికిపోయినట్లు చెప్పాడు. త్వరలోనే అతడు 'చోర్‌బజార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా ఆలీతో సరదాగాకు విచ్చేసిన అతడు ఈ విషయాలను తెలిపాడు. ఇంకా ఏం చెప్పాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 3 PM