ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : May 27, 2022, 2:57 PM IST

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

  • మోటార్లకు మీటర్లతో.. రైతుకు ఉరేస్తున్నారు : చంద్రబాబు
    CHANDRABABU: అప్పుడు ఎన్టీఆర్ వ్యవసాయ మోటర్లకు మీటర్లను తీసేస్తే.. ఇప్పుడు వైకాపా మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకువచ్చిందని చంద్రబాబు విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోటర్లకు మీటర్లు పెట్టనివ్వమని తేల్చి చెప్పారు. రైతులు దీనిపై పోరాటానికి సిద్ధం కావాలని.. తెలుగుదేశం ఇందుకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అధికారంలోకి రాగానే.. ఒకే సంతకంతో.. : అచ్చెన్నాయుడు
    ATCHANNA: చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపా లాగా.. తెదేపా గాలికి పుట్టిన పార్టీ కాదన్న అచ్చెన్న.. ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అన్నగారిపై అభిమానం అట్లుంటది మరి.. వందలాది తెదేపా బొమ్మల తయారీ!
    ఎన్టీఆర్ అనే పేరు వింటే ఆయన పులకించిపోతారు.. వయసు 83 ఏళ్లు దాటినా ఎన్టీవోడిపై ప్రేమ పెరిగిందే తప్ప, తగ్గలేదంటారాయన.. అందుకే అన్నగారు దూరమైనా.. ఆయన పెట్టిన పార్టీకి నేనుసైతం అంటూ సేవ చేస్తున్నారు. తెదేపాపై మమకారంతో.. తెలుగుదేశం పార్టీ గుర్తుతో ప్రతిమలు తయారు చేస్తూ మహానాడు ప్రతినిధులకు అందించేందుకు సిద్ధమయ్యారు. మరి, ఆయనెవరు అన్నది చూడాలంటే.. ఈ వార్త చదవాల్సిందే! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెదేపా ఫ్లెక్సీల తొలగింపు.. హెచ్చరించిన నేతలు
    TDP flexis : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో.. మహానాడుకు వెళ్లే పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దుండగులు రాత్రికిరాత్రే కత్తిరించడంపై తెదేపా నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్​కు క్లీన్​చిట్​
    Aryan Khan: షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్​కు డ్రగ్స్ కేసులో క్లీన్​ చిట్ ఇచ్చింది ఎన్​సీబీ. ఆర్యన్​కు డ్రగ్స్​తో సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'టెక్నాలజీకి గత పాలకులు దూరం- పేదలకు నష్టం'
    PM Modi: 2014కు ముందు పరిపాలనలో సాంకేతికతను ఉపయోగించకపోవడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. డ్రోన్ల సాంకేతికతతో కొత్త శకం మొదలైందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బతిమలాడుతున్నా డిక్కీలో పడేసి.. టియర్​ గ్యాస్​ వదిలి.. పోలీసుల రాక్షసత్వం!
    Brazil News: బ్రెజిల్​లో ఓ నల్లజాతీయుడి మృతికి కారణమయ్యారు పోలీసులు. అతడ్ని క్రూరంగా హింసించి ఎస్​యువీ డిక్కీలో పడేసి టియర్​ గ్యాస్​తో హింసించారు. దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసి బ్రెజిల్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒక ఛార్జింగ్‌తో 590 కి.మీ. ప్రయాణం.. బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్​ ఎంతంటే?
    BMW I4 Electric Sedan: భారత మార్కెట్​లోకి విద్యుత్‌ సెడాన్‌ ఐ4ను ప్రవేశపెట్టింది జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్​ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మెల్ట్‌వాటర్‌' చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో ప్రజ్ఞానందకు నిరాశ
    మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద పోరాడి ఓడిపోయాడు. చైనా ఆటగాడు డింగ్‌ లీరెన్‌ దూకుడుతో ఓటమి తప్పలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రివ్యూ: 'ఎఫ్‌3' మూవీ ఎలా ఉందంటే?
    F3 Telugu Movie Review: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం 'ఎఫ్​3'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది? నటీనటులు ఎలా చేశారో చూద్దాం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details