- విచారణ రేపటికి వాయిదా
హైకోర్టులో ఊర్మిళా గజపతిరాజు పిటిషన్ దాఖలు చేసింది. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఆమె అప్పీల్ చేసింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ గైర్హాజరు
హైదరాబాద్లోనీ జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం ముగిసింది. కేఆర్‌ఎంబీ(కృష్ణా బోర్డు), జీఆర్‌ఎంబీ (గోదావరి బోర్డు) ఛైర్మన్ల నేతృత్వంలో ఈ భేటీ నిర్వహించారు. ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, ఇంజినీర్లు హాజరయ్యారు. రెండు బోర్డుల సమావేశానికి తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు: ఎన్జీటీ
పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం.. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినవారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విచ్చలవిడిగా ఆక్వాసాగు
విశాఖ జిల్లాలో విచ్చలవిడి ఆక్వాసాగుతో జలవనరులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. అధికారుల అండదండలతో రాజకీయనాయకులు ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ చెరువులు తవ్వుతున్నారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు. పంట భూములూ పనికి రాకుండా పోతున్నాయని రైతులు వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెట్టుబడి సాయం విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తొమ్మిదో విడత నిధులను విడుదల చేశారు మోదీ. పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశంలో వ్యవసాయానికి కొత్త దిశలను అందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మోదీ. దాని ద్వారా కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ.. కొత్త అవకాశాల ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దాడిలో అమిత్ షా హస్తం'