- అగ్రిగోల్డ్ విచారణ త్వరగా తేల్చండి
అగ్రిగోల్డ్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభత్వం విజ్ఞప్తి చేసింది. పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని కోరింది. అనుమతిస్తే బాధితులకు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఏలూరులో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన
పశ్చిమగోదావరి జిల్లాలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు మాజీ మేయర్ నూర్జహాన్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆ ప్రజాప్రతినిధుల కేసులకు అధిక ప్రాధాన్యం'
ప్రజాప్రతినిధులకు సంబంధించి అధిక శిక్ష పడే కేసులు, ప్రస్తుతం పదవిలో ఉన్న వారి కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు అమికస్ క్యూరీ హన్సారియా. నేతల పెండింగ్ కేసుల వ్యవహారంపై రాష్ట్రాల హైకోర్టులు అందజేసిన నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తూ ఈ సూచనలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గోదాములో భారీ పేలుడు- ఆరుగురు మృతి
గుజరాత్ అహ్మదాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఎన్నికల్లో మోసం'పై సుప్రీంకు వెళ్తాం: ట్రంప్
అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరగనుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తనకు సంబంధించినంత వరకు ఇప్పటికే తాము గెలిచామని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అగ్రరాజ్య ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల హవా