corona cases: రాష్ట్రంలో కొత్తగా 3,841 కరోనా కేసులు, 38 మరణాలు - ఏపీలో కరోనా కేసులు

16:22 July 01
రాష్ట్రంలో కొత్తగా 3,841 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 3,841 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 90,574 మంది నమూనాలు పరీక్షించగా 3,841 కొత్త కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 3,963 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,178 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కరోనా వల్ల కృష్ణాలో 8, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, గుంటూరులో 5, శ్రీకాకుళంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...
ఇదీ చదవండి:
తెలుగు రాష్టాల మధ్య జలవివాదం..ప్రాజెక్టుల వద్ద భద్రత పెంపు