తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొదటి సారిగా రాష్ట్రంలో ఇవాళ 3,840 పాజిటివ్ కేసులు, 9 మరణాలు సంభవించాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. నిన్న రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
తెలంగాణలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు
తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొదటి సారిగా రాష్ట్రంలో ఇవాళ 3,840 పాజిటివ్ కేసులు, 9 మరణాలు సంభవించాయి.
కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 505 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 407, నిజామాబాద్‌లో 303, రంగారెడ్డి 302, సంగారెడ్డి 175, జగిత్యాల 167, నిర్మల్ 159, కామారెడ్డి 144, కరీంనగర్... మహబూబ్‌నగర్ 124, నల్గొండ 116, వరంగల్ అర్బన్ 114, ఖమ్మం 111, మంచిర్యాలలో 101, కొత్త కేసులు వెలుగు చూశాయి.
ఇదీ చూడండి:కిరాతకం: 20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు