తెలంగాణలో కరోనా కేసుల (Ts Corona Cases) నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు కేసుల సంఖ్య పెరుగుతుండగా... మరుసటి రోజు వీటి నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 354 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు.
Ts Corona: కరోనా కేసుల నమోదులో హెచ్చుతగ్గులు... తాజాగా 354 కేసులు - Telangana covid info
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మారుతోంది. ఒకరోజు తగ్గినట్లే కనిపిస్తున్నా...మరోసటి రోజుకు వచ్చేసరికి వీటి నమోదులో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా మరో 354 కేసులు వెలుగుచూశాయి.
కరోనా కేసుల
వైరస్ బారి నుంచి కోలుకున్న మరో 427 మంది బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. తెలంగాణ ప్రస్తుతం 6,308 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 74,634 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు టీఎస్ వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇదీ చూడండి:రేపు అగ్రి గోల్డ్ బాధితులకు నగదు చెల్లించనున్న ప్రభుత్వం