తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గురువారం ఒక్కరోజే 352 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కు చేరింది.
గురువారం మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 195కి పెరిగింది. 230 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు 3,301కి మంది డిశ్చార్జి కాగా.. 2,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి.