ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 31,719 నమూనాలను పరీక్షించగా 3,495 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,25,401కి చేరింది.
ఏపీలో కొత్తగా 3,495 కరోనా కేసులు.. 9 మరణాలు - AP covid cases news

16:34 April 11
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 719 కేసులు!
24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ 9 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో నలుగురు.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,300కి చేరింది. ఒక్కరోజులో 1,198 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 20,954 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,29,391 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి: