AP Corona Cases: కొత్తగా 3,464 కరోనా కేసులు, 35 మరణాలు - corona death toll in andhrapradesh
![AP Corona Cases: కొత్తగా 3,464 కరోనా కేసులు, 35 మరణాలు AP Corona Cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12334081-91-12334081-1625225022605.jpg)
16:10 July 02
AP Corona Cases
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,759 మంది నమూనాలు పరీక్షించగా 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 35 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 4,284 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, కడప, కర్నూలు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి
AP,TS Water Disputes: సీమ కష్టాలు తెలుసని గతంలో కేసీఆర్ చెప్పారు: సజ్జల