ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Corona Cases: కొత్తగా 334 కరోనా కేసులు.. ఒకరు మృతి - ap omicron cases

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 334 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,278 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ap corona cases
ap corona cases

By

Published : Jan 4, 2022, 5:36 PM IST

ap corona cases: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 334 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,516 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో భారీగా కరోనా కేసులు..

India covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

మొత్తం మరణాలు:4,82,017

  • యాక్టివ్ కేసులు:1,71,830
  • కోలుకున్నవారు:3,43,06,414

Vaccination in India:దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 99,27,797 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,46,70,18,464 కు చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 13లక్షల 32వేల 854 కేసులు వెలుగులోకి వచ్చాయి. 2,952 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 4,08,874 లక్షల కేసులు నమోదయ్యాయి. 708మంది ప్రాణలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,48,826 చేరింది.
  • బ్రిటన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,57,758 కేసులు నమోదయ్యాయి. 42మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
  • ఫ్రాన్స్​లో67,461 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 270 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,24,212కు చేరింది.
  • ఇటలీలో 68,052కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 140మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 63,96,110కు పెరిగింది. మరణాల సంఖ్య 1,37,786కు చేరుకుంది.
  • టర్కీలో కొత్తగా 44,869 కేసులు నమోదు అయ్యాయి. 160 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:

Dispute Between Fishermen: విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం.. ఆ తీరంలో 144 సెక్షన్​

ABOUT THE AUTHOR

...view details