రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,00,103 పరీక్షలు నిర్వహించగా.. 3,040 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,17,253 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,960కి చేరింది.
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 3,040 కరోనా కేసులు
ap corona cases
15:56 July 09
ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 యాక్టివ్ కేసులు
24 గంటల వ్యవధిలో 4,576 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,73,993కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,27,99,245 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి
CM ON JAWAN: అమర జవాన్ జశ్వంత్రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ నివాళి
Last Updated : Jul 9, 2021, 5:58 PM IST