ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 3 PM - ap top ten news

ప్రధాన వార్తలు@ 3 PM

3 PM Top News
3 PM Top News

By

Published : Feb 7, 2021, 3:00 PM IST

  • దేశ ఆరోగ్య రంగం పటిష్ఠం: రాష్ట్రపతి

దేశంలో ఆరోగ్య రంగం అన్నిరకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ స్పష్టం చేశారు. బెంగళూరులోని రాజీవ్​గాంధీ హెల్త్ సైన్సెస్​ విశ్వవిద్యాలయ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోంది: దేవినేని ఉమ

ఉద్యోగులను, ఎస్​ఈసీని బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని.. తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పల్లె పోరు: బరిలో అక్కాచెల్లెలు..నేనున్నానంటూ బంధువు

పంచాయతీ ఎన్నికలో ఓ వైపు అక్క.. మరోపక్క చెల్లెలు.. ఇదిలా ఉంటే సీన్​లోకి బంధువు ఎంట్రీ...ఇంకేముంది పల్లె పోరు కాస్త... ఫ్యామిలీ ఫైట్​గా మారిపోయింది. అక్కకు అండగా తెదేపా...చెల్లికి మద్దతుగా వైకాపా నిలిచాయి. వీరిద్దరి బంధువువైన మరో వ్యక్తికి జనసేన జై కొట్టడంతో...ఈ పల్లె పోరు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. మరోవైపు వీరి బంధుగణం ఎవరికి మద్దతు ప్రకటించాలో తెలియక డైలామాలో పడిపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆపరేషన్​ ఉత్తరాఖండ్​: రంగంలోకి 600 మంది జవాన్లు

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడటం వల్ల పెను ప్రమాదం సంభవించింది. ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. ఈ ఘటనలో 100 నుంచి 150 మంది మరణించి లేదా గాయపడి ఉంటారని ఉత్తరాఖండ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్​ చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఉత్తరాఖండ్'​కు మోదీ, షా భరోసా

ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలో జరిగిన విపత్తుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమీక్షించారు. ముఖ్యమంత్రి టీఎస్​ రావత్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ' టీకా ఉత్పత్తిలో భారత్ వ్యూహత్మక పాత్ర భేష్​'

ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్​ వ్యాక్సిన్​ ఉత్పత్తిదారుగా భారత్​ వ్యూహాత్మక పాత్రను తాము గుర్తించామని ఐరోపా కూటమి తెలిపింది. ఈ మేరకు భారత్​, ఈయూ కూటమిల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా పన్ను విధింపుపై నిర్మల స్పష్టత

కరోనా సంబంధిత పన్ను విధింపు గురించి తమ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. వార్షిక బడ్జెట్​.. దిశాత్మక మార్పును తీసుకొస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సూకీకి మద్దతుగా మయన్మార్​లో భగ్గుమన్న నిరసనలు

మయన్మార్​ సైనిక తిరుగుబాటును నిరసిస్తూ ఆందోళనలు భగ్గుమన్నాయి. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన యాంగూన్​లో 2వేల మంది నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత టెన్నిస్ దిగ్గజం అక్తర్​ అలీ కన్నుమూత

భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు, డేవిస్​ కప్​ మాజీ కోచ్​ అక్తర్ అలీ మృతి చెందారు. క్యాన్సర్​ సహా పలు అనారోగ్య సమస్యలతో రెండు వారాల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సలార్​' విలన్​ ఫిక్స్.. సోషల్​మీడియాలో పోస్టు​!

రెబల్​స్టార్​ ప్రభాస్​, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో రూపొందుతోన్న 'సలార్​' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో కన్నడ నటుడు మధూ గురుస్వామి విలన్​గా ఎంపికయ్యారని ప్రచారం సాగుతోంది. ఇదే విషయమే సదరు నటుడు సోషల్​మీడియాలో పోస్ట్​ పెట్టడం వల్ల ఆ ఊహాగానాలు నిజమే కావొచ్చని చిత్రసీమ వర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details