ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @3pm

.

By

Published : Aug 22, 2020, 3:01 PM IST

3 pm top news
ప్రధాన వార్తలు @3pm

  • కరోనాను దండించు.. జనులను దీవించు
    కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది లంబోదరుడిని బహిరంగంగా పూజించడం నిషేధించారు. మండపాలు, పెద్ద పెద్ద గణనాధులు ఎక్కడా కనిపించడంలేదు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం'
    శ్రమైక జీవనమే తన అన్నయ్య చిరంజీవి విజయానికి సోపానమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ సామాన్య కుటుంబంలో పుట్టి.. అసాధారణ వ్యక్తిగా మారారని కొనియాడారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భయం వీడి.. బాధను దిగమింగి...
    కరోనా లక్షణాలతో మృతిచెందిన కుమారుడి మృతదేహాన్ని ఒంటరిగా శ్మశానానికి తీసుకెళ్లాడు తండ్రి. అయితే ఆసుపత్రిలో మరణిస్తే కనీస రక్షణ చర్యలు చేపట్టలేదు అధికారులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మళ్లీ పెరుగుతోంది
    గోదావరిలో వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం సహా ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి మళ్లీ పెరగడంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అయోధ్యలో హైఅలర్ట్​
    దేశ రాజధాని దిల్లీలో ఐసిస్​ ఉగ్రవాది అరెస్ట్​తో అప్రమత్తమయ్యారు అధికారులు. అయోధ్య రామాలయ నిర్మాణం నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో.. హై అలర్ట్​ ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కనిపించని శోభ
    ఏటా గణేశ్​ చతుర్థి రోజున దేశవ్యాప్తంగా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. వినాయకుడి మండపాల వద్ద పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని స్వాగతిస్తారు. కానీ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఆ శోభ కనిపించడం లేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సెకన్లలోనే తగ్గించేస్తోంది?
    కరోనా మహమ్మారిని నియంత్రించే ఆయింట్​మెంట్​ను రూపొందించినట్లు అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ వెల్లడించింది. దీనికి యూఎస్​ఎఫ్​డీయే ఆమోదం కూడా తెలిపినట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వారికి 2020- లీడర్​షిప్​ అవార్డు
    మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రా, అడోబ్​ ఛైర్మన్​ శాంతను నారాయణ్​కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక లీడర్​షిప్​ అవార్డులకు వీరిద్దరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సందడి షురూ
    ఐపీఎల్​ కోసం ఆర్సీబీ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, డేల్‌ స్టెయిన్‌, క్రిస్‌ మోరిస్‌ దుబాయ్​ చేరుకున్నారు. దీంతో జట్టులో సందడి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోను సదరు ఫ్రాంచైజీ ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నేరుగా ఓటీటీలోనే
    తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరారై పోట్రు' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details