ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - trending news

.

3 pm top news
ప్రధాన వార్తలు@3PM

By

Published : Jun 21, 2020, 3:04 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు..

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకీ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 477 కేసులు నిర్ధరణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8929కి చేరింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పరిశ్రమలకు ఊతం.. గ్రామాల్లో ఉపాధే లక్ష్యం..

దశాబ్ధకాలంగా నిరుపయోగంగా ఉన్న కడప జిల్లాలోని ఏపీఐఐసీ భూములకు మహర్దశ పట్టనుంది. ఆ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొప్పర్తి ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల్లో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. ఫలితంగా.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వేదమంత్రాలతో ప్రతిధ్వనించిన తిరుమల క్షేత్రం

సూర్యగ్రహణం వేళ శ్రీవారి పుష్కరిణిలో తితిదే జప యజ్ఞం నిర్వహించింది. భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారి సేవకులు జపయజ్ఞంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • విజయనగరం జిల్లాకు నాలుగు స్కోచ్ పురస్కారాలు

విజయనగరం జిల్లాకు జాతీయస్థాయిలో నాలుగు స్కోచ్ పురస్కారాలు వరించాయి. ఒక స్వర్ణంతో పాటు, మూడు రజత పతకాలు దక్కాయి. ఎందుకు ఇన్ని పురస్కారాలు?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'రాహుల్​జీ.. స్పెల్లింగ్​ సరిచూడండి.. పరువుపోతోంది!'

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్​తో మళ్లీ దొరికిపోయారు రాహుల్​. దీంతో... 'రాహుల్​జీ స్పెల్లింగ్​ సరిచూసుకోండి... లేదా ఆ పోస్టును డిలీట్ చేయండి' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన చేసిన ఆ ట్వీట్​ ఏంటి?.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నాన్న మీకు నీరాజనాలు... మీరే లేకుంటే బతుకే లేదు

నాన్నంటే బాధ్యత.. తండ్రి అంటే భరోసా.. ఆయన కనిపిస్తే కుటుంబ సభ్యులకు ధైర్యం నడిచొస్తుంది. తనకు దుస్తులు లేకున్నా ఇంటిల్లిపాదికీ పండక్కి బట్టలు, మిఠాయిలు కొనిచ్చే నిస్వార్థ ప్రేమ తండ్రిది. పితృ దినోత్సవం సందర్భంగా... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నదిలో పడిన వధూవరుల కారు

ఝార్ఖండ్​ పలాము జిల్లాలో పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తున్న వధూవరుల కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. నదీ ప్రవాహానికి ఆ వాహనం అర కిలోమీటర్ వరకు కొట్టుకుపోయింది. చివరకు తాళ్ల సాయంతో... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​లో వార్నర్​తో పాటు ఆసీస్ క్రికెటర్లందరూ

ఐపీఎల్​ వేలంలో ఎంపికైన ఆస్ట్రేలియా క్రికెటర్ల అందరూ ఐపీఎల్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు వార్నర్. టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితేనే ఇలా జరుగుతుందని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'సుశాంత్​ కుటుంబానికి అండగా ఉండండి'

సుశాంత్​ను కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందన్న హీరో సల్మాన్ ఖాన్.. అతడి కుటుంబానికి అండగా నిలవాలని తన అభిమానుల్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details