మచిలీపట్నం, అరకు, గురజాలల్లో వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలంటే రూ.500- రూ.600 కోట్ల వరకూ వ్యయమవుతుంది. అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి, అసలు ఎలాంటి వైద్య కళాశాలలు లేని బాగా వెనుకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే... అందుకయ్యే వ్యయంలో 60శాతం వరకూ భారత వైద్య మండలి(ఏంసీఐ) సమకూర్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే తొలి దశలో పైన పేర్కొన్న 3 ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇకపై దశల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు! - ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు న్యూస్
ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మచిలీపట్నం, అరకు, గురజాల కేంద్రంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయలేదు.
3 more districs in ap
తెదేపా కార్యాలయానికి స్థలం కేటాయింపు రద్దు
కడపలో తెదేపా కార్యాలయం కోసం రహదారులు, భవనాలశాఖకు చెందిన స్థలం కేటాయింపును రద్దు చేస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
ఇదీ చదవండి: రూ. 30 కోట్లు వృథా కాదా ?: చంద్రబాబు
Last Updated : Jan 28, 2020, 6:52 AM IST