ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమంగా ఆక్సిజన్​ అమ్ముతున్న ముఠా అరెస్ట్​

తెలంగాణలోని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మౌలాలీలో ఆక్సిజన్ సిలిండర్​ల అక్రమ రవాణాను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారు. మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 120 కిలోల ఐదు సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

oxygen black markers arrested by Telangana police
ఆక్సిజన్​ అక్రమంగా అమ్ముతున్న ముఠా అరెస్ట్​

By

Published : Apr 27, 2021, 9:11 PM IST

తెలంగాణలోని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మౌలాలీలో ఆక్సిజన్ సిలిండర్​ల అక్రమ రవాణాను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్​కు తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్లను కొని.. ఎక్కువ మొత్తానికి అమ్ముతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సయ్యద్ అబ్దుల్, మహమ్మద్ మజార్, ఆసీఫ్ అనే ముగ్గురు నిందితులు.. ఎలాంటి అనుమతులు లేకుండా కరోనా రోగులకు ఎక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సిలిండర్​ని రూ. 25 వేలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 120 కిలోల ఐదు సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details