రాష్ట్రంలో ఇవాళ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 45,664 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 298 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,91,861 కి చేరింది. వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,184కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు, ఇద్దరు మృతి - ap new corona cases
రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు, ఇద్దరు మృతి
17:03 March 14
రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు
ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో164 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 88,32,77కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,400 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,45,34,762 కరోనా శాంపిల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
ఇదీ చదవండి:
Last Updated : Mar 14, 2021, 6:17 PM IST