రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 95,366 పరీక్షలు నిర్వహించగా.. 2,925 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,20,178 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 26 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,986కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,937 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,77,930కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 2,925 కరోనా కేసులు, 26 మరణాలు - ap corona latest news
రాష్ట్రంలో కొత్తగా 2,925 కరోనా కేసులు
16:13 July 10
రాష్ట్రంలో 29,262 యాక్టివ్ కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,94,611 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇదీ చదవండి:
రూ.2,500 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్
Last Updated : Jul 10, 2021, 4:43 PM IST