ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

2,723 పంచాయతీల్లో పోలింగ్...ఎన్నికల్లో తొలిసారి నోటా: జీకే ద్వివేది - AP Political news

పంచాయతీ ఎన్నికల పోలింగ్​కు విస్తృత ఏర్పాట్లు చేశామని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది వెల్లడించారు. 2,723 పంచాయతీల్లో పోలింగ్ జరగనుండగా..పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా ఏర్పాటు చేశామని వివరించారు.

2,723 పంచాయతీల్లో పోలింగ్...ఎన్నికల్లో తొలిసారి నోటా
2,723 పంచాయతీల్లో పోలింగ్...ఎన్నికల్లో తొలిసారి నోటా

By

Published : Feb 8, 2021, 4:05 PM IST

Updated : Feb 9, 2021, 4:49 AM IST

పంచాయతీ ఎన్నికల పోలింగ్​కు విస్తృత ఏర్పాట్లు చేశామని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది వెల్లడించారు. 12 జిల్లాల్లో 29,732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ఆయన... జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని వివరించారు. 215 కేంద్రాల నుంచి పోలింగ్‌ సామగ్రి పంపిణీ చేశామని... 5 కిలోమీటర్లు దాటినచోట్ల 2,216 పెద్దవాహనాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

అన్నిచోట్లా కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని జి.కె.ద్వివేది స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్‌ ఉన్నవారు చివరిగంటలో ఓటేయవచ్చని చెప్పారు. పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ఉంటుందన్న జి.కె.ద్వివేది.. పోలింగ్ తీరుపై పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా ఏర్పాటు చేశామని వివరించారు.

తొలిదశలో 525 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ద్వివేది వివరించారు. 12,185 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని వెల్లడించారు. తొలిదశలో 2,723 పంచాయతీల్లో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. మొత్తం 7,506 మంది సర్పంచి అభ్యర్థుల పోటీలో ఉన్నట్టు జి.కె.ద్వివేది వెల్లడించారు. తొలిదశలో 20,157 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా... పంచాయతీ వార్డులకు 43,601 మంది పోటీ పడుతున్నట్టు వివరించారు.

తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 3,458 సున్నిత, 3,594 అతిసున్నిత కేంద్రాలు గుర్తించామని ద్వివేది చెప్పారు. ఏకగ్రీవాలపై చిత్తూరు కలెక్టర్ నుంచి నివేదిక వచ్చిందని తెలిపారు. ఏకగ్రీవాలపై గుంటూరు కలెక్టర్ నుంచి ఇంకా నివేదిక రాలేదన్న ద్వివేది... నివేదిక వచ్చాక ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఏకగ్రీవాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జోనల్ అధికారులు 519, రూట్ అధికారులు 1,121 మందిని నియమించినట్టు వివరించారు. పోలింగ్ సరళి పర్యవేక్షణకు 3,047 మంది మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు.

ఇదీ చదవండీ... తొలి విడత ఎన్నికల పూర్తి సమాచారం.. చదవండి!

Last Updated : Feb 9, 2021, 4:49 AM IST

ABOUT THE AUTHOR

...view details