గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33,362 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు(corona tests in ap) నిర్వహించగా... కొత్తగా 262 మందికి మహమ్మారి సోకినట్లు నిర్ధరణ( corona cases in andhra pradesh) అయింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మరణించారు. కరోనా నుంచి 229 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,227 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
కొవిడ్‌తో కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు ఆధికారులు తెలిపారు. నేటి వరకు రాష్ట్రంలో 2,99,17,592 శాంపిల్స్ పరీక్షించారు.