రాష్ట్రంలో కొత్తగా 2,618 కరోనా కేసులు..16 మరణాలు - కరోనా వైరస్ వార్తలు
ap corona
17:00 November 01
రాష్ట్రంలో కొత్తగా 2,618 కరోనా కేసులు..16 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,25,966కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి 16 మంది మృతి చెందగా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 670గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 3509 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23వేల 668 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైదారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 81.17 లక్షల కరోనా పరీక్షలను నిర్వహించినట్లు బులెటిన్లో పేర్కొంది.
ఇదీ చదవండి
Last Updated : Nov 1, 2020, 5:31 PM IST