AP Corona Cases: కొత్తగా 2,567 కరోనా కేసులు, 18 మరణాలు - today ap corona cases
16:55 July 13
Today AP Corona Cases
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 81,763 పరీక్షలు నిర్వహించగా.. 2,567 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,26,988 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,042కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,034 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,87,236కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,31,30,708 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి:
ARREST: తిరుపతిలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు చైనా పౌరులు అరెస్టు