ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా కేసులు.. ఒకరు మృతి - corona virus news

రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,92,522కి చేరింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు.

ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు

By

Published : Mar 17, 2021, 6:46 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,716 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 253 కేసులు నిర్ధారణ అయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,92,522కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,186 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 137 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,83,642కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,694 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,46,11,499 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details