తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. శనివారం రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 179 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,737కు చేరింది. కొత్తగా సంగారెడ్డిలో 24, మేడ్చల్లో 14, రంగారెడ్డిలో 11 కేసులు వెలుగు చూశాయి.
శనివారం 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 182కు చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,352 మంది డిశ్చార్జయ్యారు. ఆస్పత్రిలో 2,203 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.