ప్రభుత్వ ఉద్యోగుల కోసం 25 వేల విద్యుత్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదిరింది. ఏపీ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ నెరేడ్ క్యాప్ ద్వారా ఈ వాహనాలను సమీకరించి ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు.. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళిక చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, సచివాలయ సిబ్బందికి ఈ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సాహకాలు అందించనున్నట్టు వెల్లడించింది.