తెలంగాణలో కరోనా వైరస్ ఉద్దృతి కొనసాగుతోంది. కొత్తగా 64, 649 మందికి పరీక్షలు నిర్వహించగా... 2,479 మందిలో వైరస్ వెలుగుచూసింది. జీహెచ్‌ఎంసీతో కలుపుకొని 7 జిల్లాలో 100కి పైగా కేసులు నమోదుకాగా... 12 జిల్లాలో 50కి పైగా వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది.
తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా కేసులు, 10 మరణాలు - Telangana corona latest news
తెలంగాణలో కొవిడ్ రోజురోజూకీ విజృంభిస్తోంది. తాజాగా 2 వేల 479 కేసులు వెలుగు చూశాయి. వైరస్‌తో 10 మంది మృతి చెందారు.
అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 322 కేసులు నమోదుకాగా.. రంగారెడ్డిలో 188, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 183 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో 124, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో 120, నల్గొండలో 108, నిజామాబాద్‌లో 101 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. వ్యాధి బారినపడి మరో 10 మంది చనిపోవడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 916కి చేరింది.
కొవిడ్ నుంచి మరో 2,346 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు నయమైన వారి సంఖ్య.. 1,12,587కి చేరిందని వైద్యారోగ్య శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 కరోనా యాక్టివ్ కేసులుండగా.. అందులో 24,741 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది.