ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం నుంచి ఏపీకి రూ.2,34,013 కోట్లు వచ్చే అవకాశం - Union budget latest news

రానున్న ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.2,34,013 కోట్ల నిధులు రానున్నాయి. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.1,70,976 కోట్లు కాగా... స్థానిక సంస్థలకు రూ.18,063 కోట్లు కేటాయింపులు జరిగాయి. రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.2,300 కోట్లు రానున్నాయి.

2,34,013 crore to AP from the Center
2,34,013 crore to AP from the Center

By

Published : Feb 1, 2021, 4:49 PM IST

వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.2,34,013 కోట్లు రానున్నాయి. రెవెన్యూ లోటు కింద కేంద్రం నుంచి ఏపీకి రూ.30,497 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.1,70,976 కోట్లు కాగా... స్థానిక సంస్థలకు రూ.18,063 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగానికి కేంద్రం నుంచి ఏపీకి రూ.877 కోట్లు రానున్నాయి. పీఎంజీఎస్‌వై(రోడ్లు‌) కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.344 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది.

గణాంకాలకు కేంద్రం నుంచి ఏపీకి రూ.19 కోట్లు రానున్నాయి. న్యాయవ్యవస్థ కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.295 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు రూ.250 కోట్లు, వ్యవసాయానికి రూ.4209 కోట్లు, రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.2,300 కోట్లు రానున్నాయి.

ఇదీ చదవండీ... లైవ్​ : కేంద్ర బడ్జెట్​పై ప్రత్యేక చర్చ

ABOUT THE AUTHOR

...view details