ఇన్నాళ్లూ కొవిడ్ నిబంధనలతో ఇళ్లలోనే దీక్షలు చేసిన అమరావతి రైతులు, మహిళలు శిబిరాలకు చేరుకొని ధర్నాల్లో పాల్గొంటున్నారు. తుళ్లూరులో మహిళలు హైకోర్టు చిత్రపటానికి పూజలు చేశారు. న్యాయదేవత అమరావతిని కాపాడుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి పలు ప్రాంతాల నుంచి వచ్చి.. పలువురు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పెదపరిమి, తుళ్లూరులో నిరసన కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించారు. తుళ్లూరులో దీక్షా శిబిరాన్ని పునరుద్ధరిస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు ఎన్నాళ్లైనా పోరాడతామని.. రాజధాని అమరావతిని కాపాడుకుంటామని రైతులు, మహిళలు స్పష్టం చేశారు.
230వ రోజూ.. ఆగని అమరావతి ఆందోళనలు
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన కొనసాగిస్తున్నారు. వరుసగా 230వ రోజు తుళ్లూరు, మందడం, వెలగపూడిలో నిరసన దీక్షలను చేపట్టారు.
230వ రోజూ.. ఆగని అమరావతి ఆందోళనలు