గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85,856 పరీక్షలు నిర్వహించగా.. 2,287 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,68,462 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
AP CORONA: రాష్ట్రంలో కొత్తగా 2,287 కేసులు..18మరణాలు - ap corona latest updates
రాష్ట్రంలో కొత్తగా 2,287 కేసులు..18మరణాలు
17:23 August 01
ap corona bullitain
రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,395కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,430 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,34,048కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,019 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,46,48,899 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి:
PERNI NANI: 'ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద.. నదిలోకి ఎవరూ వెళ్లొద్దు'
Last Updated : Aug 1, 2021, 6:40 PM IST