రాష్ట్రంలో కొత్తగా 22,610 కరోనా కేసులు, 114 మరణాలు
17:19 May 20
VJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 22 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,01,281 నమూనాలను పరీక్షించగా 22,610 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. మరోవైపు తాజాగా 114 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా మొత్తం మరణాల సంఖ్య 9,800కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,134 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 23,098 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు తెలిపింది.
తూర్పుగోదావరిలో 17 మంది, చిత్తూరులో 15 మంది, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 10 మంది చొప్పున, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, కృష్ణ జిల్లాలో 8 మంది, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పు, కడపలో ఇద్దరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,83,42,918 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.