రాష్ట్రంలో కొత్తగా 2,237 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,42,967కు చేరింది. తాజాగా వైరస్ బారినపడి మరో 12 మంది మృతి చెందగా... మెుత్తం మరణాల సంఖ్య 6,791 గా ఉంది. కొవిడ్ నుంచి మరో 2,256 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల సంఖ్య 8.14 లక్షల మందిగా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,403 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 86.63 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్ లో పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 2,237 కరోనా కేసులు.. 12 మరణాలు - corona death toll in ap updates
కరోనా ఉద్ధృతి రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,237 కొత్త కేసులు నమోదు కాగా.. 2,256 మంది కోలుకున్నారు. మరో 12 మంది మృతి చెందారు. వివిధ ఆస్పత్రుల్లో 21,403 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
corona cases