ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 22 కరోనా అనుమానిత కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు కలిగిన కేసులు 22 నమోదయ్యాయి. ఇప్పటివరకు 100 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. 90 కేసులు నెగెటివ్‌గా వచ్చినట్లు నివేదిక రాగా...ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో 22 కరోనా అనుమానిత కేసులు
రాష్ట్రంలో 22 కరోనా అనుమానిత కేసులు

By

Published : Mar 18, 2020, 5:48 AM IST

రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు కలిగిన కేసులు 22 కేసులు నమోదయ్యాయి. విశాఖలో 5, కాకినాడలో 2, ఏలూరులో ఒకటి, నెల్లూరులో 5, చిత్తూరు జిల్లాలో 5, ఇతర చోట్ల ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. గడచిన 12 గంటల్లో... చిత్తూరు జిల్లాలో ఇద్దరు.... అనుమానిత లక్షణాలతో చేరారు. వైరస్‌ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా.. 90 నెగెటివ్‌ అని నివేదికలు వచ్చాయి. మరో 9 కేసుల నివేదికలు రావాల్సి ఉంది. నెల్లూరులో ఇప్పటికే ఒక పాజిటివ్ కేసు వచ్చింది. కాకినాడ బోధనాసుపత్రిలో కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలను ఒకట్రెండు రోజుల్లో చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తిరుపతి స్విమ్స్‌, విజయవాడ సిద్ధార్థ వైద్యకళాశాలలో వైరస్‌ నిర్ధరణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా నివారణ దృష్ట్యా... రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 31వ తేది వరకు సెలవులు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాలు, ఇతర అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు, వేసవి శిక్షణ శిబిరాలను మూసేయాలని... ఉత్తర్వులు జారీచేసే విషయమై ఆయా శాఖల మధ్య చర్చలు జరిగాయి.

ఇదీ చూడండి:కరోనాపై యుద్ధం...కట్టడికి పూర్తి స్థాయిలో సర్కార్​ సన్నద్ధం

ABOUT THE AUTHOR

...view details