రాష్ట్రంలో మార్కెట్ యార్డుల ఆధునీకరణ కోసం రూ.212 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. రెండోదశలో మార్కెట్ యార్డుల ఆధునీకరణ , మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉన్నతాధికారులతో చర్చించారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు అనువైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రులు వెల్లడించారు. మార్కెట్ యార్డుల్లో నూతన షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించటం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించినట్టుగా మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.