AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు - ఏపీలో కరోనా వార్తలు
16:57 July 30
కరోనా నుంచి కోలుకున్న మరో 2,127 మంది బాధితులు
రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 80,641 మంది నమూనాలు పరీక్షించగా 2,068 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2,127 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,198 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. కొవిడ్ కారణంగా.. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు మృతి చెందగా.. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి:
Night curfew: రాష్ట్రంలో ఆగస్టు 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు