ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈసారి సామాన్యుడికి నిరాశ తప్పదా? - budget 2021-22 latest news

కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రతిసారి.. తమకేం వరాలు ప్రకటిస్తుందా అని ఆశగా ఎదురుచూసేది సామాన్యుడే. మామూలుగానే కేంద్రం ఏటా ప్రవేశపెట్టే పద్దుపై ఎన్నో అంచనాలుంటాయి. సర్కార్‌ తమకేం వరాలు ఇస్తుందో అని వేయి కళ్లతో ఎదురు చూస్తుటారు వీళ్లు. ప్రస్తుతం ఈ సారి ఆ నిరీక్షణ ఇంకాస్త ముందుగానే మొదలైంది. కరోనా మోసుకొచ్చిన ఆర్థిక సంక్షోభం తరవాత తీసుకొచ్చిన బడ్జెట్ కావటం వల్ల సామాన్యులు మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ పద్దు గాయపడిన ఆర్థిక వ్యవస్థకు మందు పూసిందా..? సగటు వేతన జీవి ఆశలను నెరవేర్చిందా...?

budget 2021-22
బడ్జెట్ 2021-22

By

Published : Feb 2, 2021, 1:37 PM IST

బడ్జెట్ 2021-22

ప్రతిసారిలాగే.. బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు అన్న రెండు వారాల ముందు నుంచే సామాన్య జనంలో ఎన్నో ఆశలు. మరెన్నో కోరికలు. కానీ ఈ ఏడాది పరిస్థితులు మరింత దారుణం.. దేశ జనాభాలో చాలా వరకు మధ్యతరగతి వర్గమే. వీరిలోనూ గరిష్ఠంగా ఆధారపడుతుంది.. చిన్నపాటి ఉద్యోగాల పైనే. ఈ కారణంగానే కరోనా విసిరిన సవాళ్లకు ముందుగా బలైపోయింది ఈ వర్గమే. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతుండగా, మరికొంత మంది జీతాల్లో కోతలకు గురయ్యి ఆర్థిక సర్ధుబాట్లతో నెట్టుకొస్తున్నారు. పైగా... ఉద్యోగాలు చేసి, చిన్నచిన్న పొదుపులు చేసి దాచుకున్న కొద్దిపాటి సొమ్ములు సైతం.. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ఖర్చైపోయాయి. ఇలా అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులు ఈ బ‌డ్జెట్‌పై ఎన్నోఆశలుపెట్టుకున్నారు. కానీ అవన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి.

జాడ లేని కొత్త సంక్షేమ పథకాలు

ప్రస్తుత బడ్జెట్‌లో కొత్తగా సంక్షేమ పథకాల జాడ కనిపించలేదు. కొవిడ్‌ ప్రభావంతో రాబడి తగ్గిపోయింది. రెవిన్యూ లోటు ఎకాఎకిన పెరిగింది. ప్రజారోగ్యం, కొవిడ్‌-19 వ్యాక్సిన్ పంపిణీకి భారీగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రభుత్వం మిగతా ఖర్చులూ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి కొత్త పథకాలు తీసుకురాని కేంద్రం.... ఉన్నవాటికే ఆచితూచి కేటాయింపులు చేసింది. ప్రస్తుతం ఫర్టిలైజర్లు, ఆహారం, పెట్రోలియం మీద అందిస్తున్న సబ్సిడీ సైతం బాగా తగ్గించారు.

ఉద్యోగులకు నిరాశ

అంతంత మాత్రమే ఆదాయం ఆర్జిస్తున్న వేతన జీవులు.... పన్ను మినహాయింపులు ఇస్తే బాగుంటుందని ఆశపడ్డారు. కానీ... కేంద్రం నుంచి వారికి ఎలాంటి ఊరట కలిగించే ప్రయోజనమూ చేకూరలేదు. ముఖ్యంగా పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించి... ఉద్యోగుల్లో నిరాశ కలిగించింది. దీంతో వేతన జీవుల నెలవారీ సంపాదనల్లో కోతలు యథాతథంగానే కొనసాగనున్నాయి.

చిన్న ఊరట

ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లిన ప్రస్తుత తరుణంలో... సామాన్యులకు ఊరట కలిగించిన అంశం ఇంటి కొనుగోళుదారులకు వడ్డీ మినహాయింపు పొడిగింపు. దేశంలోని అందరికీ ఇళ్లు అనే విధానం అనుసరిస్తున్న కేంద్రం ప్రభుత్వం... సొంత ఇళ్లు కొనుగోలు చేసే వారికి లాభం చేకూరేలా గతంలో ప్రకటించిన వడ్డీ రాయితీనీ ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ప్రకటించిన పథకం ద్వారా... 1.5 లక్షల వరకు రాయితీ లభిస్తోంది. ప్రవాస శ్రామికులకు త‌క్కువ అద్దె తో ఇళ్ళ లభ్యతను ప్రోత్సహించేందుకు నోటిఫై చేసిన‌ అందుబాటులో అద్దె ఇళ్లు ప‌థ‌కాల‌కు ప‌న్ను మిన‌హాయింపులను మంత్రి ప్రకటించారు.

ఎలక్ట్రానిక్ వస్తువల ధరలకు రెక్కలు

ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదనల నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగ నున్నాయి. ముఖ్యంగా ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు పెరుగుదలకు అవకాశముంది. ఎల్‌ఈడీ బల్బులు, సర్క్యూట్‌ బోర్డులు, వాటి విడి భాగాలు, సోలార్‌ ఇన్వెర్టర్స్‌, సోలార్ దీపాల ధరలకు రెక్కలు రానున్నాయి. దీంతో ఇంట్లో పరికరాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు భారంగా మారనున్నాయి. పైగా... దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, లిథియంతో తయారు చేసిన ఫోన్‌ బ్యాటరీుపై అదనపు పన్ను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్రం ఆర్థిక మంత్రి. ఫలితంగా... మొబైల్‌ ఫోన‌్‌ ధరలు మరింత పెరగనున్నాయి. వీటితో పాటే... విలువైన రాళ్లు, రత్నాలు ధరలకు రెక్కలు రానున్నాయి. ఆటో మొబైల్‌ విడి విభాగాల దిగుమతులపై ధరలు పెంచడం, రాగి వంటి పదార్థాలపై పన్నులు విధించడంతో... విండ్‌ స్క్రీన్స్‌, సిగ్నలింగ్‌ పరికరాల ధరలు పెరుగుతాయి. ముడి సిల్క్‌, నూలు వస్త్రాల ధరలు..ప్లాస్టిక్‌ వస్తువులు, సింథటిక్‌ వస్తులు, వంటనూనె ధరలు పెరుగుతాయి.

ఇదీ చదవండి:'50 శాతం మంది జీవన ప్రమాణాల్లో క్షీణత'

ABOUT THE AUTHOR

...view details