రాష్ట్రంలో నిన్నటితో పోల్చితే కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా.. 2,010 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 470 కేసులు అదనంగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,59,942 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,312కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,956 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,25,631కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,43,24,626 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,010 కరోనా కేసులు, 20 మరణాలు - ఏపీలో కరోనా కేసులు
రాష్ట్రంలో నిన్నటితో పోల్చితే కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా.. 2,010 కేసులు నిర్ధారణ అయ్యాయి.
కరోనా కేసులు
జిల్లాల వారీగా కేసుల వివరాలు..