గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు అమరావతి దీక్ష తీసుకున్నారు. అమరావతి ఐకాస ఆధ్వర్యంలో దాదాపు 200 మంది రైతులు, మహిళలు అమరావతి దీక్ష తీసుకున్నారు. దీక్షకు చిహ్నంగా ఆకుపచ్చ కండువాను ధరించారు. అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి రైతులకు కండువా కప్పారు. కండువా ధరించిన వ్యక్తి రోజు ఇద్దరికీ అమరావతి ఉద్యమాన్ని వివరించాలని, దీక్ష తీసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కండువా ధరించాలని శివారెడ్డి చెప్పారు.
200 మంది రైతులు, మహిళల 'అమరావతి దీక్ష'
గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో దాదాపు 200 మంది రైతులు, మహిళలు అమరావతి దీక్ష తీసుకున్నారు. దీక్షకు చిహ్నంగా అమరావతి ఐకాస సమన్వయకర్త శివారెడ్డి రైతులకు ఆకుపచ్చ కండువాను ధరించారు. కండువా ధరించిన వ్యక్తి... రోజు ఇద్దరికీ అమరావతి ఉద్యమాన్ని వివరించాలని... దీక్ష తీసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కండువా ధరించాలని శివ రెడ్డి చెప్పారు.
అమరావతి దీక్ష తీసుకున్న 200 మంది రైతులు, మహిళలు
ఈ దీక్షతో అమరావతి ఉద్యమం కీలక దశకు చేరుకుందని ఐకాస నేతలు తెలియజేశారు. అమరావతి దీక్షకు ఉద్దండరాయునిపాలెం చేరుకున్న ఐకాస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం గుంపుగా కాకుండా విడతలవారీగా వెళ్లాలని చెప్పారు.
ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కీలక భేటీ