- పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనన్న స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని ఏపీకి ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంలో విచారణ
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్జీటీలో కమిటీ నివేదికపై అభ్యంతరాలను 10 రోజుల్లో సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్‌ను సుప్రీం ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొండకు బోల్టులు.. రాళ్లు జారి పడకుండా శాశ్వత పరిష్కారం
ఇంద్రకీలాద్రి పైనుంచి రాళ్లు జారి కిందపడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టిసారించారు. దేశంలోని పలు ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ)కు చెందిన నిపుణులతో కూడిన బృందం దుర్గగుడికి నవంబర్ 2న రాబోతోంది. కొండ మొత్తాన్ని వీళ్లు పరిశీలించనున్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఉండేందుకు ఏమేం చేయాలనే విషయాలన్నింటిపైనా అధ్యయనం చేస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ కన్నుమూత
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్(92) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కరోనాతో ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ శ్వాసకోశ సమస్య తీవ్రమవటం వల్ల ఆరోగ్య క్షీణించి తదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దిల్లీ కాలుష్య నియంత్రణకు కేంద్రం ఆర్డినెన్స్
దిల్లీ వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రం. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ గెజిట్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి.. ఈ కమిషన్‌లో పూర్తికాలం ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భూ చట్టాలకు వ్యతిరేకంగా పీడీపీ ఆందోళన- పలువురి అరెస్ట్