ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

By

Published : Aug 9, 2022, 1:03 PM IST

  • RTC Bus: ఆర్టీసీ బస్సు మాయం... అంతలోనే..!
    విజయనగరం జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వంగర గ్రామంలో ఆర్టీసీ బస్సు మాయం కావడం కలకలం రేపింది. అయితే కొంత సేపటికే దాని ఆచూకీ లభ్యం కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Bread festival: వరాల రొట్టె పిలుస్తోంది.. భక్తుల రాకతో.. మొదలైన సందడి
    Bread festival: సర్వమత సమానత్వానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషాహీద్ రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు...బారాషాహీద్‌ దర్గాను సందర్శించుకున్న అనంతరం స్వర్ణాల చెరువులో స్నానమాచరించి రొట్టెలు మార్చుకుంటున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ రొట్టెల పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కిలాడి కపుల్​.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
    Couple Fraud: వాళ్లిద్దరూ దంపతులు.. అందరిలా ఏదో ఓ పని చేసుకుంటూ జీవనం సాగించకుండా.. మోసాల బాటను ఎంచుకుని "కిలాడి కపుల్​"గా మారారు. సగం ధరలకే విమానం టిక్కెట్లు.. తక్కువ ధరకే ఐఫోన్లు ఇప్పిస్తామంటూ అమాయక జనాలను ఆశపెట్టి అందినకాడికి దోచుకున్నారు. ఆ కిలాడి కపుల్​ స్టోరీ ఎంటో మీరూ తెలుసుకోండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Anandaiah: "మంకీ పాక్స్‌కు కూడా మందు తయారు చేస్తాను"
    Anandaiah: కరోనాకు మందు తయారు చేశానని చెప్పిన ఆనందయ్య.. ఇప్పుడు మంకీ పాక్స్‌కు కూడా మందు తయారు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకృతి వైద్యంలో ప్రతి వ్యాధికి మందు ఉంటుందన్నారు. వ్యాధి లక్షణాలను బట్టి మందు తయారు చేస్తానని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నితీశ్​ ప్లాన్​కు భాజపా కౌంటర్.. ఆ ఎమ్మెల్యేలపై వేటు!.. మరి ప్రభుత్వం ఏర్పాటు ఎలా?
    JDU BJP alliance breakup: బిహార్​లో జేడీయూ ప్రణాళికలకు భాజపా కౌంటర్ వ్యూహాలు రచిస్తోంది. ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కమలదళం అలర్ట్ అయింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు పడేలా పావులు కదుపుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బిహార్​ రాజకీయంలో కీలక ట్విస్ట్.. గవర్నర్ వద్దకు నితీశ్!
    బిహార్​లో ప్రభుత్వం మార్పు తథ్యమన్న ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ అపాయింట్​మెంట్ కోరింది జేడీయూ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్రంప్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు.. లాకర్లు బద్దలు.. ఆ రహస్య పత్రాల కోసమే?
    FBI raids on Trump home: అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు నిర్వహించింది. తన ఇంటిని ఎఫ్​బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని.. లాకర్లను పగులగొట్టారని ట్రంప్ మండిపడ్డారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొత్త రూల్స్​తో చెక్కులకు అదనపు భద్రత
    Cheque pps system : డిజిటల్‌ చెల్లింపులు జోరందుకున్నప్పటికీ.. అధిక విలువగల లావాదేవీలకు ఇప్పటికీ చెక్కులు కీలకంగానే ఉన్నాయి. చెక్కులో పేర్కొన్న మొత్తాన్ని దిద్దడం, ఫోర్జరీ సంతకాలు వంటి ఇబ్బందులున్నప్పటికీ.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇవి ఎంతో ప్రధానమైనవిగానే చెప్పొచ్చు. ఈ మోసాలకు తావు లేకుండా ఇప్పుడు పాజిటివ్‌ పే సిస్టమ్‌ (పీపీఎస్‌) అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నీరజ్​చోప్రా 'గోల్డ్​మెడల్​' రికార్డ్​ బద్దలు.. ఎవరా అథ్లెట్​?
    Commonwealth Games 2022 Neeraj chopra: కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా జావెలిన్‌ త్రోలో ఓ అథ్లెట్‌ రికార్డు త్రో విసిరి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో భారత అథ్లెట్‌, ప్రపంచ నంబర్‌వన్‌ నీరజ్ చోప్రా కూడా షాక్​ అయ్యాడు! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దూసుకుపోతున్న 'బింబిసార-సీతారామం' కలెక్షన్స్​.. ఎంతంటే?
    Bimbisara-Sitaramam Collections: నందమూరి హీరో కల్యాణ్​రామ్​ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అప్పటి నుంచి బాక్సాఫీస్​పై దండయాత్ర చేస్తూనే ఉంది. ఇప్పటికే మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా నాలుగో రోజు కూడా మంచి వసూళ్లనే సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details