ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

By

Published : Jul 1, 2022, 12:59 PM IST

  • జగన్‌ సీఎంగా ఉంటే.. రెడ్లదేగా అధికారం: డిప్యూటీ స్పీకర్‌
    పదవులు రాలేదని రెడ్డి సామాజికవర్గం బాధపడొద్దని, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే అధికారం రెడ్డి సామాజికవర్గానిదేనని భావించాలని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్లలో గురువారం నిర్వహించిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Gym Trainer for Modi : మోదీకి.. వ్యాయామ శిక్షకుడిగా మంచిర్యాల వాసి
    Gym Trainer for Modi :ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం నోవాటెల్‌లో బస చేస్తారు. మోదీ రెండ్రోజుల పర్యటనలో భాగంగా.. ఆయనకు ప్రత్యేక వ్యాయామ శిక్షకుడిని నియమించింది తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ. మంచిర్యాలకు చెందిన గడప రాజేశ్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • GAS LEAK: గ్యాస్‌ లీకై.. కార్మికులకు అస్వస్థత
    GAS LEAK: ఓ కర్మాగారంలో గ్యాస్‌ లీకై బిహార్‌కు చెందిన కొందరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాయిలర్‌ సమీపంలోని బావిలో దిగిన వ్యక్తి.. గ్యాస్‌ పరిశీలిస్తుండగా లీకైంది. అతడిని కాపాడేందుకు మరో నలుగురు చొరవ తీసుకోగా.. ఆ క్రమంలో వారూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


  • 'పార్టీ ప్రతినిధి అయితే ఇష్టానుసారం మట్లాడుతారా?'.. నుపుర్​పై సుప్రీంకోర్టు ఆగ్రహం
    Supreme Court Nupur Sharma: మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకురాలు నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయితే మాత్రం ఇష్టానుసారం మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యువతుల మధ్య లవ్​.. పెళ్లైందని తెలిసి చితకబాదిన బంధువులు
    ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. వివాహం కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతుల బంధువులు వారిని చితకబాదారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ దేశ పార్లమెంట్‌ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు
    Israel Parliament: వివిధ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానిని విజయవంతంగా ముందుకు కొనసాగించడంలో ఇజ్రాయెల్​ దేశ ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్‌ అతితక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేటి నుంచి ఈ కొత్త మార్పులు అమలు.. అవేంటో తెలుసుకోండి
    ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే పలు మార్పులు నేటి (జూలై1) నుంచి అమల్లోకి రానున్నాయి. ఆధార్​- పాన్​ అనుసంధానం, క్రెడిట్​ కార్డులు, క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రత్యక్ష బోర్డుల పన్ను ఇలా పలు విషయాల్లో మార్పులు రాబోతున్నాయి. వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • India vs England: గెలిస్తే అరుదైన ఘనత.. రీషెడ్యూల్​ టెస్టు ప్రత్యేకతలివే!
    గతేడాది ఇండియా-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో కరోనా కారణంగా రీషెడ్యూల్​ అయిన ఆఖరి మ్యాచ్​ ఎడ్జ్​బాస్టన్​ వేదికగా శుక్రవారమే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​. అయితే సిరీస్​లో భారత్​ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్​ కీలకంగా మారింది. అప్పటికీ ఇప్పటికీ రెండు జట్లకు కెప్టెన్లు మారారు. అప్పుడు ఆడిన చాలా మంది ఇప్పుడు ఆయా తుది జట్లలో లేరు. ఈ మ్యాచ్​కు ముందు కొన్ని ఆసక్తికర​ విషయాలు తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సుశాంత్ ఎక్స్ గర్ల్​ఫ్రెండ్​ గురించి ఆ విషయం తెలుసా?
    నటిగా కన్నా దివంగత నటుడు సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ గర్ల్​ఫ్రెండ్​గానే ప్రాచుర్యం పొందింది రియా చక్రవర్తి. నేడు (జులై 1) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె విశేషాలపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details