ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

By

Published : May 3, 2022, 1:01 PM IST

  • విజయనగరంలో మహిళపై అర్ధరాత్రి అత్యాచారం
    విజయనగరం జిల్లా ఉడా కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ దుండగుడు అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఉపాధి కోసం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరం వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమానుషం.. పింఛను సొమ్ము​ లాక్కొని.. కన్నతల్లిని రోడ్డుపై వదిలేసి
    Son left his mother on road: ఈ లోకంలో అమ్మను మించిన దైవం ఉండదంటారు.. గుడిలో ఉన్న అమ్మవారిపై ఉన్న భక్తి, గౌరవం ఇంట్లో ఉండే తల్లిపై ఉండటం లేదు.. నవమాసాలు మోసి, కని, పెంచిన ఆ అభాగ్యురాలిపై ప్రేమ కాదు కదా.. కనీసం కనికరం చూపడంలేదు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేసి అన్నంపెట్టిన చేతులకు పండుటాకుల్లా మారిన స్థితిలో ఆదరణ కరవైపోతోంది. కన్నతల్లి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆమెకు వచ్చిన పింఛను డబ్బులు లాక్కుని మరీ.. రోడ్డుపై వదిలేశాడు ఓ కుమారుడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పదో తరగతి పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌లో దర్యాప్తు ముమ్మరం.. వెలుగులోకి కీలక అంశాలు
    Mall practice: కృష్ణా జిల్లాలో పరీక్ష పత్రాల మాల్‌ ప్రాక్టీస్‌లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాల్ ప్రాక్టీస్‌లో కార్పొరేట్ పాఠశాల పాత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Couple dead: అరకులోయలో విషాదం.. విద్యుత్​ షాక్​తో దంపతులు మృతి
    Couple dead: రోజు మాదిరిగానే ఆ వైరుపై బట్టలు ఆరేస్తున్నారు. కానీ ఊహించని విధంగా విద్యుత్​ షాక్​ తగిలింది. భర్తను కాపాడేందుకు వెళ్లి భార్య సైతం విద్యుత్​షాక్​కు గురైంది. స్థానికులు అంబులెన్స్​కు కాల్​ చేసినా.. ఆలస్యంలో రావడంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలీసు అధికారిని గుంతలో పడేసి.. వేట కొడవలితో..
    Police Inspector attacked by villagers: మైనింగ్​ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ ఎస్సైని గుంతలో పడేసి వేట కొడవలితో దాడి చేసేందుకు యత్నించిన సంఘటన ఒడిశాలోని కోరాపుట్​ జిల్లాలో జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంట్లోకి చొరబడి తండ్రి, కూతురిపై చిరుత దాడి
    Leopard attack in up: ఉత్తర్​ప్రదేశ్​లోని మహారాజ్​గంజ్​లో చిరుత కలకలం రేపింది. కిషన్​పుర్​లోని ఠూఠీబారీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి తండ్రి, కుమార్తెపై దాడి చేసింది. ఈ దాడిలో సుబాశ్​(45) ఆమె కుమార్తె అంబిక(18) తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రంజాన్​ వేళ జోధ్​పుర్​లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్​ బంద్​
    రంజాన్‌ పండగ వేళ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పరాగ్​కు ఉద్వాసన తప్పదా? 'ట్విట్టర్​' ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
    Elon Musk twitter: ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్ సంస్థలోని​ పలువురికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ట్లిట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్​ లీగల్‌ హెడ్‌ విజయ్​ గద్దెను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం యాజమాన్యంపై ఎలాన్​ మస్క్​కు ఏమాత్రం విశ్వాసం లేదని సంస్థ ఓ ఉన్నతాధికారి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓపెనింగ్‌లో చెన్నై రికార్డు.. ఇతర జట్లు ఎలా ఉన్నాయంటే?
    IPL 2022: ఐపీఎల్ ప్రస్తుత సీజన్​లో తీవ్రంగా విఫలమైన చెన్నై ఓపెనర్లు సన్​రైజర్స్​తో మ్యాచ్​లో మాత్రం రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. మరి మిగతా జట్ల ఓపెనర్లు ఎలా ఉన్నారు. ఆ టీమ్​ల పరిస్థితి ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మెట్ ​గాలాలో మస్క్​ సందడి.. చిత్రవిచిత్ర డ్రెస్సుల్లో తారలు
    Met Gala event 2022: మెగా ఫ్యాషన్ ఈవెంట్​ 'మెట్​ గాలా' అమెరికాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో పలువురు అందాల తారలు, నటులు, వ్యాపారవేత్తలు.. డిఫరెంట్​ లుక్స్​లో దర్శనమిచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details