ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

..

1PM TOP NEWS
TOP NEWSప్రధాన వార్తలు @ 1 PM

By

Published : Apr 28, 2022, 1:01 PM IST

  • Lokesh: సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ..ఎందుకంటే..!
    Nara Lokesh letter to CM Jagan: ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. మ‌ద్దతు ధ‌ర‌తో ఖ‌రీఫ్ ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, ధాన్యం బ‌కాయిలు త‌క్షణ‌మే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2021-22 ఖరీఫ్ సీజన్​లో ఇంకా 42 ల‌క్షల ట‌న్నులకుపైగా ఖ‌రీఫ్ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గోనెగండ్ల పాఠశాలలో ఊడిన పెచ్చులు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
    కర్నూలు జిల్లా గోనెగండ్లలోని పాఠశాలలో పెచ్చులు ఊడిపడ్డాయి. ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ పాఠశాల నాడు-నేడుకు ఎంపిక కాలేదని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AP HRDI: హెచ్‌ఆర్‌డీఐ సంస్థ.. గుట్టు చప్పుడు కాకుండా విశాఖకు..!
    AP HRDI: రాష్ట్ర విభజన తర్వాత బాపట్లలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థను గుట్టుచప్పుడు కాకుండా విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తోంది. విశాఖలోని చెంగల్రావుపేటలో జీవీఎంసీకి చెందిన పాత భవనాన్ని అద్దెకు తీసుకుంది. దాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే పనులు వేగంగా జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Audio Viral: చెవిరెడ్డి పల్లెబాట విజయవంతానికి తంటాలు.. మహిళా సంఘాలకు బెదిరింపులు
    MLA Chevireddy Pallebata: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పల్లెబాట విజయవంతం చేయడానికి.. అధికారుల తంటాలు పడుతున్నారు. కార్యక్రమానికి మహిళా సంఘంలో ప్రతి సభ్యురాలు హాజరుకావాలని.. లేకుంటే ఆసరా రుణాల మంజూరుకు సంతకాలు పెట్టబోనని.. మహిళా అధికారి బెదిరింపులకు దిగారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రధాని వ్యాఖ్యలు'
    Rahul Gandhi On Fuel Prices: ఇంధన ధరలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే.. ఇంధన ధరలు పెరుగుతున్నాయని మోదీ వ్యాఖ్యానించటాన్ని తప్పుపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేరళలో మరోసారి షిగెల్లా కలకలం.. కోజికోడ్​​లో తొలి కేసు
    Shigella News: కేరళ కోజికోడ్​లోని ఏడేళ్ల బాలికకు షిగెల్లా సోకింది. ఆమె పొరుగింట్లోని మరో చిన్నారిలో కూడా వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే మిగతా ఎవరికీ వ్యాధి వ్యాపించలేదని, ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సైనికుల ఆకృత్యాలు.. 400 లైంగిక దాడి కేసులు
    Ukraine news: రష్యా-ఉక్రెయిన్​ల మధ్య గత కొన్ని రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది. తమ లక్ష్యం సామాన్య పౌరులు కాదు.. సైన్యమే టార్గెట్‌ అంటూ యుద్ధం ఆరంభించిన పుతిన్‌ సేనలు.. ఉక్రెయిన్‌లోని మహిళలు, చిన్నారులనూ వదలడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'క్రిప్టోపై తొందర వద్దు.. సరైన నిర్ణయం తీసుకుంటాం'
    Crypto Currency In India: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్రిప్టోకరెన్సీ నియంత్రణపై భారత్​ సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​.. నాకు చాలా భయమేస్తోంది: హార్దిక్
    IPL 2022 Hardik pandy: తాము నాకౌట్‌ దశకు చేరుకొనే సరికి అదృష్టం కలిసిరాదేమోనని గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఆందోళన వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ తమ ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సమంతలో ఈ యాంగిల్​ కూడా ఉందా?
    'జెస్సీ'గా వెండితెరకు పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు నటి సమంత అక్కినేని. మొదటి చిత్రంతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం 'ఈగ', 'రంగస్థలం', 'యూటర్న్‌', 'ఓ బేబీ', ఫ్యామిలీ మ్యాన్​(వెబ్​సిరీస్​) వంటి విభిన్న చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details