- పవర్ లిఫ్టర్ సాధియాకు నారా లోకేష్ అభినందనలు
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి స్వర్ణ పథకం సాధించిన సాధియాను నారా లోకేశ్ అభినందించారు. తనకు చేతనైనా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రముఖ హాస్యనటుడు అలీకి జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ హాస్య నటుడు అలీని జీవిత సాఫల్య పురస్కారం వరించింది. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సినీనటి పి. శివపార్వతికి వెంకటేశ్వర గుప్త పురస్కారం లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏ నిమిషానికి.. ఏమి ఊడునో.. ఆర్టీసీ బస్సులో!
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్నాడో సినీ కవి. ప్రస్తుత ఆర్టీసీ బస్సులోని పరిస్థితి చూస్తే... ఏ నిమిషానికి ఏమి ఊడునో ఎవరూహించెదరు... అంటున్నారు ఆర్టీసీ ప్రయాణికులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. బీజాపూర్ జిల్లాలో తెలంగాణ గ్రేహైండ్స్, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండు రైళ్లలో అగ్నిప్రమాదం- దగ్ధమైన బోగీలు
కాసగంజ్ ప్యాసింజర్ రైలు జనరల్ బోగీలో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు నుంచి దూకడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఉత్తర్‌ప్రదేశ్ ఫరుఖాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం- మూడు నెలల పాటు..
ఓ బాలికపై కొందరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన జరిగిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. మూడు నెలల పాటు వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎస్పీ నేత పీయూష్ జైన్ అరెస్టు- మరో రూ.10 కోట్లు సీజ్
ఉత్తర్‌ప్రదేశ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీల నుంచి మరో రూ.10 కోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్రెజిల్లో భారీ వరదలు-18 మంది మృతి
బ్రెజిల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో 18 మంది చనిపోయారు. మరో 280 మందికిపైగా గాయపడ్డారు. 35 వేల మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాహుల్ మరో ఘనత.. పుజారా చెత్త రికార్డు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలోనే ఓ రికార్డును నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిగిరిన పుజారా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'టైగర్ బతికే ఉన్నాడు.. పాము కూడా బతికే ఉంది'
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను పాము కరిచిందనే వార్త అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. అయితే తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి సమస్య లేదని చెప్పారు సల్మాన్. పామును చంపలేదని, దానితో దోస్తీ కుదుర్చుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు@1PM