- జలదిగ్బంధంలో దేవీపట్నం
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి వరద ఉద్ధృతితో 38 గ్రామాలు నీట మునిగాయి. కొన్ని గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లినప్పటికీ మరి కొన్ని గ్రామాల వాళ్లు మాత్రం ప్యాకేజీ చెల్లించేవరకు బయటికి వచ్చేది లేదని అక్కడే ఉన్నారు. నమ్మించి ఓట్లు వేయించుకుని... తీరా నెగ్గిన తర్వాత తమకు మొండిచేయి చూపించారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉత్సాహంగా ఆషాడ సారె
ఇంద్రకీలాద్రిపై ఉత్సాహంగా ఆషాడ సారె కార్యక్రమం జరుగుతోంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఆషాడ సారెను సమర్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గమ్యం చేరేసరికి ఒళ్లు హూనం!
అడుగుకో గొయ్యి.. గజానికో గుంత.. కనుచూపు మేర కంకర తేలిన దారి..! గొయ్యెక్కడుందో గుర్తించడమూ గగనమే..! కిలోమీటరు ప్రయాణిస్తే చాలు.. ఒళ్లు హూనం..! చినుకు పడితే ఇక చుక్కలే..! ఊర్లకు దారి చూపండి మహాప్రభో అంటూ..అక్కడి ప్రజలు వేడుకున్నా.. ప్రయోజనం లేకపోయింది..! అయినా.. మరమ్మతులకు నోచుకోని కృష్ణా జిల్లా గ్రామీణ మార్గాల పరిస్థితిపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అరెస్ట్ వారెంట్.. ఎవరికంటే..?
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేసిన రాజశేఖరరెడ్డి.. బెయిల్ ఉత్తర్వులను ఉల్లంఘించారు. ఈ మేరకు గుంటూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అరెస్టు వారెంట్ జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఎం పదవికి రాజీనామా
కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాటకీయతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్ యడియూరప్ప తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని సోమవారం యడ్డీ స్వయంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెగాసస్ రగడ