ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

...

top news
ప్రధాన వార్తలు

By

Published : Mar 8, 2021, 1:02 PM IST

  • మహిళా దినోత్సవ సందర్భంగా కేక్​ చేసిన సీఎం జగన్​

ముఖ్యమంత్రి జగన్​ రాష్ట్ర ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రతినిధులతో కలిసి కేక్ కట్​ చేసి అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'స్త్రీ సమానత్వం, సాధికారతే సమాజ ప్రగతికి మూలం'

అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా మహిళలు ఎదుగుతున్నారని చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళలకు సామాజిక సాధికారత కల్పించేలా చర్యలు: సీఎం

మహిళల భద్రత కోసం దిశ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారుచేసిన 900 దిశ వాహనాలను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంటి పై నుంచి పడిపోయిన సీఐ.. ఆరా తీస్తున్న పోలీసులు

నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో వీఆర్​లో ఉన్న సీఐ శేషారావు.. గుంటూరు జిల్లాలో తన ఇంటిపై నుంచి పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చమురు ధరలపై ఆందోళన- రాజ్యసభ రెండుసార్లు వాయిదా

దేశంలో పెరుగుతన్న చమురు ధరలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేయడం వల్ల రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది. ఈ విషయంపై తర్వాత చర్చిద్దామని ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించినా.. ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నార్తర్న్ రైల్వేలో 'నారీ' ఇంజిన్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే ఇంజిన్లకు వీరవనితల పేర్లు పెట్టాలని నార్తర్న్ రైల్వే నిర్ణయించింది. మహిళల గౌరవార్థంగా నారీలోకానికి వీటిని అంకితం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కర్ణాటకలో 25కిలోల జిలెటిన్ పట్టివేత

కర్ణాటకలోని ఓ క్వారీలో 25 కిలోల జిలెటిన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత భద్రతా విభాగానికి చెందిన పోలీసు అధికారి నేతృత్వంలోని బృందం నిర్వహించిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అగ్ని ప్రమాదంలో 8 మంది సజీవ దహనం

యెమెన్​లో ఓ నిర్బంధ కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 170 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వారిలో 90 మంది పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గ్రౌండ్​లోనే కాదు.. ఇక్కడా ఆడుతామంటున్న క్రికెటర్లు

సొంతగడ్డపై ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ను చేజిక్కించుకున్న టీమ్​ఇండియా ఆటగాళ్లు.. ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. టీ20 సిరీస్​కు ముందు ఉన్న ఖాళీ సమయాన్ని వెరైటీగా ఎంజాయ్​ చేశారు. చిన్న పిల్లల్లా మారి సరదాగా గడిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్‌

డబ్బు విషయంలో సొంతవాళ్లే మోసం చేశారని భావోద్వేగానికి గురయ్యారు నటుడు రాజేంద్రప్రసాద్​. తాను కామెడీ హీరో ఎందుకయ్యారో వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details