- 'గిడుగు జయంతిని జరుపుకోవడం.. తెలుగును సన్మానించడమే'
గిడుగు జయంతి భాషా దినోత్సవం కావడం తెలుగును సన్మానించుకోవడమే అని సీఎం జగన్ అన్నారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి.. తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'దళితుల ప్రాణాలంటే వైకాపా నాయకులకు చులకనా?'
తెలుగుదేశం పార్టీ పట్టుబట్టడం వల్లే ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ జరిపారని చంద్రబాబు అన్నారు. హడావుడిగా అంత్యక్రియలు జరపడం ఒక తప్పు అయితే.. రహస్యంగా పోస్ట్ మార్టమ్ జరపడం ఇంకో తప్పని ఆక్షేపించారు. మృతుడి సెల్ ఫోన్ ను పోలీసులే లాగేసుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా దళిత నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 10 రోజులు చికిత్స.. రూ.15 లక్షలు బిల్లు.. చివరికి మృతి!
విజయవాడలోని ఆటోనగర్ లిబర్టీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతి వ్యవహారం వివాదాస్పదమైంది. కొవిడ్ చికిత్స పేరుతో రూ.15 లక్షలు వసూలు చేశారని మృతుడి భార్య ఆరోపించారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మరణించాడని పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మొట్టమొదటి ఏకదంతుడి విగ్రహ ప్రతిష్ఠ అక్కడే!
ఛత్తీస్గఢ్లో 2500 అడుగుల ఎత్తులో ధోల్కల్ పర్వతంపై విశిష్ట చరిత్రగల గణేశుడి విగ్రహం వందల ఏళ్లుగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఏకదంతుని రూపంలో ఉన్న ఈ వినాయకుడి ప్రతిమను పరశురామునితో చేసిన పోరాటానికి గుర్తుగా 11వ శతాబ్దంలో చిందక్ నాగవంశీయులు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి భోగామి తెగకు చెందిన వారు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- యూపీలో ఆగని వరదలు.. కొట్టుకుపోయిన కారు
ఉత్తర్ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహారన్పుర్లో వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తుపాను మధ్యలోకి విమానంతో దూసుకెళ్తే..