Amaravati Farmers Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 19వ రోజు ఏలూరు జిల్లాలో కొనసాగింది. దెందులూరు మండలం పెరుగుగూడెం నుంచి తిమ్మాపురం మీదుగా ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు అడుగడుగునా ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని రైతులు వాపోయారు. కనీసం నిద్రించడానికి వసతి దొరక్కుండా ఆంక్షలు విధిస్తోందన్నారు. తాత్కాలిక టెంట్లలోనే చలిలో తలదాచుకున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలో రహదారులు మొత్తం గోతులమయమని విమర్శించిన రైతులు.. రోడ్లకు మరమ్మతులే చేయించలేని వాళ్లు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.
19వ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర.. కన్నీటి పర్యంతమైన ఏలూరు జిల్లా ప్రజలు - శ్రీవేంకటేశ్వరస్వామి
Maha Padayatra: అమరావతి రైతులకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఏలూరు జిల్లాలో ప్రజలు రైతులపై పూలవర్షం కురిపించారు. రైతులకు మద్ధతుగా మహిళలు, చిన్నారులు సైతం యాత్రలో పాల్గొన్నారు. మహిళా రైతుల కష్టాలు చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.
Etv Bharat
రైతుల పాదయాత్రకు వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున మద్ధతు తెలుపుతున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి రైతులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు యాత్రలో పాలుపంచుకుంటున్నారు. పాదయాత్రకు రైతులు శనివారం విరామం ఇవ్వనున్నారు. ఆదివారం ద్వారకా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి యాత్ర ప్రారంభించనున్నారు.
ఇవీ చదవండి: