తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం అత్యధికంగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు చనిపోయారు. రాష్ట్రానికి చెందిన 196 మందికి కరోనా నిర్ధరణ అయింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 122, రంగారెడ్డిలో 40 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ముగ్గురికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు - covid 19 death stats telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 2,698కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,428 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 1,188 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 82కి చేరింది.
రాష్ట్రానికి చెందిన కేసుల వివరాలు
జిల్లా | కేసులు |
జీహెచ్‌ఎంసీ | 122 |
రంగారెడ్డి | 40 |
మేడ్చల్ | 10 |
ఖమ్మం | 9 |
మహబూబ్నగర్ | 3 |
మెదక్ | 3 |
జగిత్యాల | 3 |
వరంగల్ అర్బన్ | 2 |
నిర్మల్ | 1 |
సూర్యాపేట | 1 |
యాదాద్రి | 1 |
జనగామ | 1 |
మొత్తం | 196 |