ప్రస్తుతం తెలంగాణలో 26,644 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 21,784 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 292 మంది వైరస్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 187, మేడ్చల్ జిల్లాలో 145 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 105, కరీంనగర్ జిల్లాలో 109, ఖమ్మం జిల్లాలో 117, సిద్దిపేట జిల్లాలో 89 మంది కొవిడ్ బారిన పడ్డారు.
తెలంగాణలో కొత్తగా 1,983 కరోనా కేసులు, 10 మంది మృతి - రాష్ట్రంలో కొత్త కేసుల తాజా వార్తలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1,983 కొవిడ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,02,594కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 1,181 మంది మృతి చెందారు. వైరస్ నుంచి కోలుకుని మరో 2,381 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 1,74,769 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.
new-corona